కన్నడ స్టార్ హీరోను చెప్పుతో కొట్టిన అభిమాని.. పునీత్ రాజ్ కుమార్ ను కించపరచడమే కారణమా.. !

-

కన్నడ స్టార్ హీరో దర్శన్ కు తాజాగా చేదు అనుభవం ఎదురయింది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న అతనిపై ఒక అభిమాని చెప్పుతో దాడి చేశాడు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

గత కొంతకాలంగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు కన్నడ స్టార్ హీరో దర్శన్.. ప్రస్తుతం దర్శన్ క్రాంతి అనే చిత్రంలో నటించారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న ఈయనకు చేదు అనుభవం ఎదురయింది.. స్టేజ్ పై నిల్చోని ఈయన అభివాదం చేస్తున్న సమయంలో ఒక అభిమాని దర్శన్ పైకి కి చెప్పు విసిరాడు.. ఈ ఫొటోస్ అక్కడే ఉన్న కెమెరామెన్ తన కెమెరాలో బంధించగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

అయితే గత కొన్నాళ్ల క్రితం ఈయన చేసిన వ్యాఖ్యలే ఇలా జరగటానికి కారణమని అంటున్నారు సినీ వర్గాలు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శన్.. అభిమానులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు ఈ అభిమానం అంతా నాకు బతికుండగానే దొరకడం చాలా ఆనందంగా ఉంది ఉదాహరణకు పునీత్ రాజ్ కుమార్ ని తీసుకోండి ఆయన చనిపోయిన తర్వాత ఆయన అభిమానులంతా అతని మీద ప్రేమ చూపిస్తున్నారు.. కానీ నేను బతికి ఉండగానే నాకు ఈ అదృష్టం దొరికింది అంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలా అభిమాని చేయటానికి కారణం కూడా పునీత్ రాజ్ కుమార్ ను కించపరుస్తూ మాట్లాడడమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై పునీత్ రాజ్కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ స్పందించారు ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని అందరం ప్రేమతో అభిమానంతో ఉందామని ఇలాంటి విషయాలు ఎవరూ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news