మద్దతు ధర రాదని నాలుగెకరాల్లో పత్తి పంటను పీకేసిన రైతు!

-

అన్నదాతలు ఆగం అవుతున్నారు. కొన్నిసార్లు ప్రకృతి వారిని ఆగం చేస్తుంటే మరికొన్ని సార్లు ప్రభుత్వం సమయానికి ఆదుకోకపోవడం, పంట అమ్మే సమయంలో దళారులు వారిని మోసం చేస్తున్నారు. ఎలా చూసినా రాష్ట్రంలో రైతులే దగా పడుతున్నారు. మద్దతు ధర రాదేమోనని భయంతో తాజాగా ఓ రైతు చేసిన పని కంటతడి పెట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పత్తి పంటను పండించాడు.ఇటీవల ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షానికి పెన్‌గంగ ఉప్పొంగి రెండెకరాల పత్తి నీట మునిగింది.

దీంతో మద్దతు ధర రాదని తన నాలుగెకరాల్లో వేసిన పత్తిని రైతే స్వయంగా పీకేసాడు. ఈ ఘటన ఆదిలాబాద్-భీంపూర్ మండలంలోని అర్లి(టీ)గ్రామంలో వెలుగుచూసింది. అసలు విషయానికొస్తే రైతు గుమ్ముల వెంకటి నాలుగెకరాల్లో రూ.60 వేల పెట్టుబడితో పత్తిని వేశాడు. పెన్‌గంగ వరదలో నీట మునిగిన పత్తికి దిగుబడి రాదని, మరో రెండెక రాల పత్తికి ధర వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెందాడు. దీంతో మొత్తం నాలుగెకరాల్లో పత్తిని పీకేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version