ప్రారంభమైన మోడీ కేబినెట్ తొలి సమావేశం

-

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గాలోని ప్రధాని నివాసంలో నూతన కేంద్ర మంత్రులతో మోడీ భేటీ అయ్యారు. పార్లమెంట్ తొలి సెషన్, కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో 100 రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళికపై నూతన మంత్రులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత జరుగుతోన్న ఫస్ట్ కేబినెట్ భేటీ కావడంతో పాటు.. ఈ సమావేశంలోనే నూతన మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ ఏ శాఖలు ఎవరికీ కేటాయిస్తారు..? కీలకమైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు వంటి ఫోర్ట్ ఫోలియోలు ఎవరి కట్టబెడతారు..? తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఐదుగురు మంత్రులకు ఏ శాఖలు దక్కుతాయనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. మోడీ 3.0 ఫస్ట్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news