అమెరికాలో ఉండి అమెరికా కంటే భారత్ ఎంత గొప్పదో చెప్పిన అమ్మాయి…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపధ్యంలో… భారత్ కి అమెరికాకు మధ్య ఉన్న తేడాను నేను చెప్పాలని అనుకుంటున్నారు. మన దేశం కంటే అమెరికా ఎంతో పెద్ద దేశం మన దేశ జనాభా 130 కోట్లు అయితే అమెరికా జనాభా 35 కోట్లు. అక్కడ మన కంటే ఎక్కువ స్థలం, ఇంటి ఇంటికి దూరం… విశాలమైన రోడ్లు ఇలా ఏది చూసినా సరే అమెరికా మనకంటే చాలా గొప్పది. అక్కడ స్వేచ్చ ఎక్కువ, 16 ఏళ్ళు దాటితే తల్లి తండ్రులతో సంబంధం ఉండదు…

ఎవరు ఎవరితో అయినా సహజీవనం చేయవచ్చు, బ్రాండెడ్ బట్టలు, ఖరీదు అయిన కార్లు, ప్రపంచంలో ఏ దేశానికి లేని రక్షణ వ్యవస్థ. చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు… అదో భూతల స్వర్గం. కాని 35 కోట్ల జనాభాను కంట్రోల్ చేయలేక పెరుగుతున్న కేసులను ఆపలేక, మరణాలను అదుపు చేయలేక… జనాలను పూడ్చి పెట్టడానికి స్థలం లేక… అమెరికా నానా ఇబ్బందులు పడుతుంది. అమెరికా ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంది.

కాని మన దేశం మాత్రం 135 కోట్ల మందిని కంట్రోల్ చెసింది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ అమలు చేస్తుంది… పరిస్థితిని ముందే ఊహించింది. వ్యాధి సోకినా వాళ్ళకు వెంటనే చికిత్స చేయడం, వ్యాధి సోకిన వాళ్ళనే కాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను కుటుంబ సభ్యులను క్వారంటైన్ లో ఉంచడం ఇలా ఎన్నో చేసి కరోనా వైరస్ ని మన దేశంలో కట్టడి చేసారని న్యూయార్క్ నుంచి ఆమె వివరించారు. అసలు ఆమె పూర్తిగా ఎం చెప్పారో ఈ వీడియో లో చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version