గుడ్ న్యూస్.. ఎలుకలపై సత్ఫలితాలు ఇచ్చిన కరోనా వ్యాక్సిన్..!

-

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే . అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ మోడెర్న ఒక వ్యాక్సిన్ రూపొందిస్తోంది. తాజాగా ఈ వ్యాక్సిన్ గురించి శుభ వార్త చెప్పింది మోడర్న కంపెనీ. ఇటీవలే క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ వ్యాక్సిన్ను ఎలుకల పై ప్రయోగించగా… సత్పలితాలు వచ్చినట్లు తెలిపారు.

మూడు వారాల వ్యవధిలో ఎలుకకు వాక్సిన్ ఇవ్వగా… ఎలుకలో వైరస్ను చంపే వ్యాధినిరోధకాలు పెరిగినట్లు ఇటీవల పరిశోధనలో తేలినట్లు మెడెర్న కంపెనీ పరిశోధకులు తెలిపారు, ఇక ఆ తర్వాత రెండో ఇంజక్షన్ ఇవ్వగానే… కరోనా సోకిన ఎలుకలో ఊపిరితిత్తులు, ముక్కు లో వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version