సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు… రేవంత్ షాకింగ్ నిర్ణయం

-

సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం లేఖ ద్వారా విషయాన్ని తెలియజేసింది.

The government has written a letter to the Telangana State Election Commission to hold elections in September
The government has written a letter to the Telangana State Election Commission to hold elections in September

కాసేపట్లోనే ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెలువలనుంది. కాగా, గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రో. కోదండరాం, అజహరుద్దీన్ క్యాబినెట్ ఫైనల్ చేసింది. ఈరోజు జరిగిన సమావేశంలో వీరిద్దరి పేర్లకు ఆమోదం తెలిపారు. గతంలో ప్రో. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా… ఇటీవలే వారిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజహరుద్దీన్ కు అవకాశం కల్పించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news