గుడ్ న్యూస్..సీనియర్ సిటిజన్ల కోసం దేశంలోని మొదటి హెల్ప్‌లైన్ ప్రారంభం..

-

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన సందెహాలను తీర్చడానికి కొందరిని కేటాయించి ఉంటారు.వినియోగ దారుల కోసం ఏదైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ పొందు పరుస్తారు. మనం తాగే నీళ్ల నుంచి తలకు రాసుకొనే నూనె, కాళ్ళకు చెప్పులు వరకూ అన్నీటికి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు ఉంటాయి. ఇలా ఒకటేమిటి..దేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వ సేవలకు సంబంధించిన హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి..యూత్ కు సంబంధించిన సేవలు, గృహ వినియోగం ఇలా ప్రతి సేవలకు హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.

 

కానీ ఇప్పటి వరకు సీనియర్స్ కు సంబంధించిన విషయాల గురించి వివరించడానికి, లేదా వారికి సంభందించిన పథకాల సేవల గురించి పూర్తీ వివరాలను తెలిపెందుకు ఎటువంటి హెల్ప్‌లైన్లు లేవు. వీరి రక్షణ దృష్ట్యా ప్రభుత్వం కొన్ని చర్చల అనంతరం సీనియర్ సిటిజన్ల కోసం దేశంలోని మొదటి హెల్ప్‌లైన్ ను ప్రారంభించింది. ఎల్డర్ లైన్ పెన్షన్ సమస్యలు, చట్టపరమైన సమస్యలపై ఉచిత సమాచారం మరియు మార్గదర్శకత్వం అందిస్తుంది, భావోద్వేగ మద్దతును అందిస్తుంది. దుర్వినియోగ సందర్భాలలో జోక్యం చేసుకుంటుంది..మరియు నిరాశ్రయులను కాపాడుతుంది..అందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందించింది.. 14567 నెంబర్ కు కాల్ చేయవచ్చు.అత్యవసర పరిస్థితులు కలిగితే ఎప్పుడైనా కాల్ చేయవచ్చనని ట్విట్టర్ లో పెర్కొంది.ఈ సేవను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.ప్రభుత్వ ఆలోచన బాగుందని కొందరు సీనియర్ సిటిజన్ల హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version