ఉత్తర కొరియాలో కరోనా విలయ తాండవం.. 21 మంది మృతి..

-

కరోనా రక్కసి ఉత్తర కొరియాలో విలయ తాండవం చేస్తోంది.. మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఉత్తర కొరియాలో ఇటీవల మొదటి కరోనా కేసు నమోదు కావడంతో దేశంలో లాక్ డౌన్ విధించాడు దేశ అధ్యక్షుడు కిమ్. అయితే.. ఉత్తర కొరియాను జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్‌ చివరి వారం నుంచి ఉత్తర కొరియాలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్‌తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ అయింది. తాజాగా మరో 21 మంది జర్వానికి బలయ్యారు. కాగా, వీరి మరణానికి కారణం కరోనానా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా బయటపెట్టలేదు.

ఉత్తర కొరియాలో ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య 2,80,810కి చేరింది. జర్వంతో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూడు దశల్లో విళయతాండం చేసినప్పటికీ కిమ్‌ ఏలుబడిలో ఉన్న కొరియాలో మాత్రం ఒక్క కేసూ నమోదవలేదు. అయితే తాజా పాజివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతోపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. గతంలో కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సిన్లను అందిస్తామని డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించాయి. అయితే కిమ్‌ దానికి ఒప్పుకోలేదు. ఉత్తర కొరియా ప్రజలు ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చూసినట్లయితే కిమ్‌ తప్పిదంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version