కరోనా కేసులు పెరగడానికి కారణం చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి..?

-

గత కొంతకాలం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా వైరస్ కేసులు గత కొన్ని రోజుల నుంచి మళ్ళి విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అనే దానిపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శీతాకాలం ప్రారంభం కావడం వాయు కాలుష్యం పండుగ సీజన్ కారణంగానే ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు కరోనా వైరస్ కేసులు పెరగటమే కాదు గాలి నాణ్యత కూడా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రజలు మాస్క్లు ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. భౌతిక దూరం పాటించడంలేదని.. అందుకే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version