ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి. చాలా మంది హీరోలు, కొంత మంది హీరోయిన్స్ ను తమకు అనుకూలంగా మలుచుకుని వారిని ఉపయోగించుకుంటారు.
కాని కొంత మంది హీరోయిన్స్ మాత్రం ప్రేమకు గాని , రిలేషన్ షిప్ కు కూడా ఒప్పుకోరు.అలాంటి వారిలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ది గ్రేట్ వాణిశ్రీ గారు. తనతో నటించాలంటే హీరోలు కూడా వొళ్ళు దగ్గర పెట్టుకొని మరీ నటించే వారట. ఆమె వ్యవహారం చూసి ఎవ్వరూ కూడా ఆమె వద్ద ప్రేమ వ్యవహారం టాపిక్ తెచ్చే ప్రయత్నం చేసే వారు కాదట.
ఒక హీరో ఆమెను ప్రేమించినా అది మనసులోనే ఉంచుకున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా వాణిశ్రీ గారే బయట పెట్టారు. సదరు హీరో కు వాణిశ్రీ అంటే విపరీతమైన క్రేజ్ అట. ఒక రోజు వాణిశ్రీ గారికి పెళ్ళి కుదిరి పెళ్ళి కార్డ్ ఇవ్వటం కోసం ఆ హీరో ఇంటికి వెళ్లిందట. అప్పుడు ఆ హీరో అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడట. అప్పుడు తన మనసులో మాట చెప్పాడట. అప్పుడు వాణిశ్రీ ముందే ఎందుకు చెప్పలేదు అనే సరికి నీకు చెప్పాలంటే భయం వేసిందని అన్నాడట. దానితో వాణిశ్రీ నవ్వి ఊరుకుందట.