ఒంటరితనం అంటేనే ఇష్టం అంటున్న స్టార్ హీరోయిన్..?

-

శృతిహాసన్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మడు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తనకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ వైపు అడుగులు వేసింది కానీ అక్కడ వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోంది.

అయితే ఇటీవలే ఈ అమ్మడు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఒంటరితనం అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. కొన్నాళ్లుగా తన కుటుంబం తో కాకుండా ఒంటరిగానే ఉంటున్నాను అని తెలిపింది. ఇక తన తండ్రిని కూడా కేవలం చెన్నై వచ్చినప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటా అని… ఒంటరితనం అలవాటయిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక లాక్డౌన్ సమయంలో కూడా ఒంటరిగానే ఉన్నానని.. ఎక్కడా బోర్ కొట్టలేదు అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన ఇంట్లో అన్ని పనులు తానే చేసుకుంటాను అంటూ తెలిపింది,

Read more RELATED
Recommended to you

Latest news