ఆ నగరమంతా 14 అంతస్తుల్లోనే..

-

ఇళ్ల సముదాయలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు అన్ని కలిపే ఓ ప్రాంతం అవుతుంది. ఇంకాస్త పెద్దదైతే నగరంగా మారుతుంది. కానీ.. అక్కడ మాత్రం ఆ నగరమంతా ఒకే భవనంలో ఉందంటే నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. నమ్మాల్సిందే. యూఎస్‌లోని అలస్కా రాష్ట్రం విట్టియర్‌ అనే నగరంలోని సగానికి పైగా జనాభా ఆ భవనంలోనే ఉంటుంది. బయట దొరికే ప్రతి వస్తువు, సామగ్రి, తదితరాలన్నీ ఆ భవనంలోనూ దొరుకుతాయి.

నాడు మారుమూల ప్రాంతం..

పర్వతాలు, ఓడరేవు, సముద్ర తీరాలతో సుందరంగా కనిపించే మారుమూల ప్రాంతమే విట్టియర్‌. ఆహ్లాదకరమైన వావరణం ఉండటంతో అక్కడ సందర్శకు తాకిడి ఎక్కువే.ఈ ప్రాంతంలోనే ‘బెగిచ్‌ టవర్స్‌’అనే పేరుతో 14 అంతస్తుల భవనం ఉంది. దానికి ఆనుకునే∙మరికొన్ని భవనాల సముదాయలు, కార్యాలయాలు ఉన్నావి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న జనాభాలో సగానికి పైగా ప్రజలు బెగిన్‌ టవర్స్‌లోనే నివసిస్తుంటారు. ఆ భవనంలో కొంత మందికి సొంత ఇళ్లు ఉండగా, మరికొందరు సీజన్ల వారీగా వచ్చేందుకు అద్దెకు తీసుకుని పెడుతుంటారు. ఆ భవనంలోనే పోలీస్‌ స్టేషన్, పోస్టాఫిస్, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, క్లబ్బులు, అన్ని వర్గాలకు చెందిన ప్రార్థన మందిరాలు ఉన్నావి. పర్యటల కోసం టెర్రస్‌పై ప్రత్యే గదులు ఏర్పాటు చేశారు. పండగలు ప్రత్యే సమావేశాలప్పుడు భవనంపై నిర్వహిస్తుంటారు.

ఇదీ కారణం..

అమెరికా సైన్యం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విట్టియర్‌ ప్రాంతంలో గుడారాలు వేసుకొని మిలటరీ క్యాంప్‌గా చేసుకుంది. యుద్ధం అనంతరం సైనికుల కోసం ఇక్కడే భవనాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన కార్యాయం నిర్మించాలని 1953 ప్రారంభించి 1957లో పూర్తిచేసి దానికి హోగ్డే బిల్డింగ్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత మరో భవనం నిర్మించి ఆ రెండింటిని మూడేళ్ల దాకా వాడుకొని సైన్యాన్ని మరో చోటకి మార్చేశారు. 1964లో భూకంపం రావడంతో ఆ భవనం కొంత భాగం దెబ్బదినగా 196 ఫ్లాట్లు ఉన్న భవనం మాత్రం చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రానురాను ప్రజల రాకపోకలు పెరిగి ఆ భవనంలో గదులను కొనుగోలు, అద్దెలకు తీసుకోవడం ప్రారంభించారు. ఆలస్కా నాయకుడైన నిక్‌ బెగిచ్‌ పేరుతో ఆ భవనానికి ప్రస్తుతం బెగిచ్‌ టవర్స్‌ అని పిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version