ఫుట్ పాత్ పై దుకాణాలు పెట్టిన వారిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫుట్ పాత్ ను ఆక్రమించుకుంటే ఇక మీదట కఠిన చర్యలే తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ప్రధాన రోడ్ల తో పాటు స్లీప్ రోడ్డు మీద ఫుట్ పాత్ కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమర్షియల్ ఏరియాలో ఫుట్ పాత్ మీద వస్తువులను డిస్ ప్లే చేయడం నిషిద్ధమని తెలిపారు.
పాదాచార్లకు వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా వస్తువులు పెడితే చర్యలు తీసుకుంటామనిహెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఫుట్ పాతుల ఆక్రమణ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు.. లకడికాపూల్ పంజాగుట్టలో ఫుట్ పాతుల ఆక్రమణ పై ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. ఫుట్ పాత్రను ఆక్రమించి వస్తువులను పెట్టిన వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. పలు వ్యాపార సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.