తిరుమలలో ఘోర అపచారం చోటు చేసుకుంది. తిరుమల కొండకు కాలి నడకన వెళ్లే అలిపిరి మార్గంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం వదిలి వెళ్లారు. మలమూత్రాలు, మద్యం బాటిళ్లు విసిరేస్తున్న ఇలాంటి ప్రదేశంలో స్వామివారి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి… దీనిపై సీఎం చంద్రబాబు స్పందించాలని భూమన డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా భూమన కరుణ రెడ్డికి భాను ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరుణ రెడ్డికి బండి తాళాలకు అలాగే గుడి తాళాలకు తేడా తెలియదని ఫైర్ అయ్యారు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉందని గుర్తు చేశారు. అది మహావిష్ణు విగ్రహం కాదని.. గత 20 సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడే ఉందని క్లారిటీ ఇచ్చారు.