వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ప్రియుడితో కలిసి భర్త గొంతుకు తాడు బిగించి హతమార్చింది ఆ మహిళ. ఈ సంఘటన తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని గజసింగరాజపురంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని గజసింగరాజపురంకు చెందిన ఇద్దరు దంపతుల కాపారాన్ని అక్రమ సంబంధం చిదిమేసింది. ప్రియుడి మోజులో పడి.. భర్తనే చంపే వరకు తెచ్చింది. ఇందులో భాగంగానే… ప్రియుడితో కలిసి భర్త గొంతుకు తాడు బిగించి హతమార్చింది ఆ మహిళ. మద్యం తాగొచ్చి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది భార్య. కానీ అసలు విషయం బయటపడటంతో… నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.