ఉచిత బస్సు పథకం లబ్ది దారులకు అలర్ట్. అప్‌డేటెడ్ ఆధార్ కార్డ్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం అంటూ బోర్డు పెట్టింది ఆర్టీసీ యాజమాన్యం. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణం ఉండదని బస్సుల్లో దర్శనమిస్తున్నాయి నోటీసులు.

ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనే ఉండడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు కండక్టర్లు. ఆధార్ కార్డు అప్‌డేటెడ్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని బస్సులో కనిపిస్తున్నాయి నోటీసులు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు, మీసేవ కేంద్రాలకు పోటెత్తున్నారు మహిళలు. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్తున్నారు ఉన్నతాధికారులు.