కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన

-

చత్తీస్గడ్ రాజధాని రాయపూర్ లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజైన శనివారం రోజు రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్ కి “ప్రత్యేక హోదా” అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏపి కి “ప్రత్యేక హోదా” ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు, సహాయం లేకపోతే అభివృధ్ది సాధ్యం కాదని తీర్మానం లో ప్రస్తావించింది.

అలాగే ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ను పునరుద్దరిస్తామని ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ను కల్పిస్తామని తీర్మానంలో పేర్కొంది. లడక్ ను రాజ్యాంగంలోని 6 వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చి, లడక్ ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షిస్తామని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version