ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రజలు ఏ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండేలా.. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే గతంలో కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో.. కరోనా మృతుల కుటుంబాలకు 15వేల రూపాయలు చెల్లించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
.తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. కరోనా తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు 15000 అందించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ప్లాస్మా దానం చేసిన వారికి 5వేల రూపాయల ప్రోత్సాహకం కూడా అందించాలి అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్.