హైదరాబాద్ నుంచి కరోనా టీకా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

-

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిశోధకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలోని భారత్ బయోటెక్ సంస్థ నుంచే తొలి వ్యాక్సిన్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు చెందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉండటం… ఎంతో గర్వకారణం గా ఉంది అంటూ తెలిపిన కేటీఆర్… కరోనా కు తొలి టీక హైదరాబాద్ నుంచి రావడం ఖాయం అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశోధకులు నిరంతర కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version