The kashmir files: కాశ్మీర్ ఫైల్స్ మూవీలో చాలా అబద్ధాలు చూపించారు : ఒమర్ అబ్ధుల్లా

-

‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా. ఈ సినిమాలో చాలా అబద్దాలు చూపించారని ఆరోపించారు. 1990లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికాంలో లేదని… కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆ సమయంలో కాశ్మీర్ లో గవర్నర్ పాలన నడుస్తుందని ఆయన అన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కల్పిత కథగా కొట్టిపారేశారు. దక్షిణ కుల్గామ్ లోజరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒమర్ అబ్ధుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ఇది అసలు సినిమానా.. డ్యాక్యుమెంటరీనా అనేది స్పష్టంగా తెలియదని కామెంట్ చేశారు. ఈ సినిమా వాస్తవికత ఆధారంగా రూపొందించబడలేదని ఆయన ఆరోపించారు. కేవలం కాశ్మీర్ పండిట్లు మాత్రమే చంపబడలేదని.. ముస్లింలు, సిక్కులు కూడా చంపబడ్డారని..వారు కూడా కాశ్మీర్ వదిలి వలస వెళ్లారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version