“ది కేరళ స్టోరీ”: వివాదాలతోనే రికార్డ్ కలెక్షన్స్ … !

-

ఫేడ్ అవుట్ హీరోయిన్ ఆదా శర్మ హీరోయిన్ గా మరియు ఇతర నాయికలు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “ది కేరళ స్టోరీ”. ఈ సినిమాను సుదీప్తో సేన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని , ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి వివాదం అవుతుందని తెలిసినా ప్రేక్షకుల ముందు తీసుకువచ్చాడు. ఈ సినిమా మే 5వ తేదీన విడుదలైంది, అప్పటి నుండి రోజూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. కాగా ఈ రోజు కేవలం మన ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం దేశాలలో రిలీజ్ చేశారు. దీనికి కారణం సినిమాపై వస్తున్న ప్రశంసలే అని చెప్పాలి. మొదటగా హిందీ భాషలో మాత్రమే సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమా పలు భాషలలో రీమేక్ లేదా డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమాను ప్రదర్శించకుండా నిషేధాన్ని విధించారు. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మాత్రం ఈ సినిమాను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. పైగా ఈ సినిమాపై పలు వివాదాలు వస్తున్నప్పటికీ కమర్సియల్ గా కూడా రికార్డు కలెక్షన్ లు వస్తున్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version