టెన్త్‌ పాసైన విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

-

ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. ఈ నెల 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానించి…జూన్ 26 నుంచి అడ్మిషన్లు కల్పిస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తొలిదశ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఎంవీ శేషగిరిబాబు వెల్లడించారు.

తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మే 15 నుండి దరఖాస్తు అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్‌ 14లోపు సమర్పించాల్సి ఉంటుంది. జూన్‌ 1 నుండి తరగతులు ప్రారంభించనున్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి 10వ తరగతి మార్కుల జాబితాను ఇంటర్నెట్‌ నుండి తీసుకున్న కాపీల ఆధారంగా తీసుకోవచ్చు. పదోతరగతి మార్కుల మెమోలు వచ్చిన తరువాత వాటిని తీసుకోవచ్చు. అన్ని జూనియర్ కళాశాలలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ‘రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌’ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఎ 29 శాతం, బీసీ-బి 10 శాతం, బీసీ-సి 1 శాతం, బీసీ-డి 7 శాతం, బీసీ-ఈ 4 శాతం వంతున సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే విభిన్న ప్రతిభావంతులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా విద్యార్ధులకు 5 శాతం, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ల పిల్లలకు 3 శాతం, ఈబీసీలకు 10 శాతం వంతున అడ్మిషన్లలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version