పవన్ పొత్తులపై మాట్లాడాక వరుసగా వైసీపీ నేతలు అతనిపై ప్రశ్నలు మరియు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పవన్ ను ఉద్దేశించి.. పవన్ ప్యాకెజీ తీసుకోకపోతే ఎందుకు పదే పదే చంద్రబాబును కలవడం ? ఒక కాపు కులస్థుడు అయిన పవన్ కాపులను అణచివేసిన చంద్రబాబు తో ఎలా కలుస్తున్నాడు. ఇది కాపుల ఆత్మగౌరవాన్ని మంటకలపడం కదా అంటూ అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కూడా పవన్ ను అడ్డం పెట్టుకుని కాపుల ఓట్లను కాజేయడానికి పొత్తుల నాటకం ఆడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేశాడు.
కాపు కులస్తులకు సూటి ప్రశ్న సంధించిన మంత్రి అంబటి … !
-