నాకేం తెలియదు, బర్త్ డే పార్టీ అంటే వెళ్ళా: రేప్ బాధితురాలు

-

కూకట్‌పల్లి అత్యాచారం ఘటన సంచలనంగా మారింది. పుట్టిన రోజు పార్టీ అని చెప్పి బాధితురాలిని హోటల్ కి తీసుకు వెళ్లి రేప్ చేసారు. ఈ అత్యాచారం ఘటనలో బాధితురాలు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు విజయవాడ పోలీసులు. 3 నెలల క్రితం జోసెఫ్‌ నాకు పరిచయమయ్యాడు అని ఆమె చెప్పింది. బర్త్‌ డే ఉందని నన్ను తీసుకెళ్లారని అత్యాచార బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

కేక్‌ తిన్న తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదని, జరిగిన ఘటనను ఎవరికైనా చెబుతే చంపేస్తామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆమె కన్నీరు పెట్టుకుంది. నిందితులకు కఠిన శిక్ష పడాలని, అత్యాచార బాధితురాలు పేర్కొంది. కాగా ఈ కేసుకి సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version