బ్రేకింగ్: ఏపీలో సరికొత్త భారీ కుంభకోణం…!

-

ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల వ్యవహారంపై రెవెన్యూశాఖ అధికారులను కలిసేందుకు వచ్చారు తుళ్లూరు ఎస్పీ. ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులను విచారిస్తున్నారు. సచివాలయంలో ఎస్బీఐ శాఖ అధికారులనూ ప్రశ్నించనున్న పోలీసులు… గతంలో జారీ చేసిన చెక్ లకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రశ్నలు వేసారు. బెంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ లో, రూ.24.65 కోట్లు.. ఢిల్లీలోని సిసిపీసిఐ ఎస్బిఐ బ్రాంచ్‌ లో 39.85 కోట్లు, బెంగళూరులోని మంగళూరులో మూడ్ బాద్రీశాఖకు 52.65 కోట్లు నకిలీ చెక్కులు ఇచ్చారని గుర్తించారు.

Money

ఫోర్జరీ చెక్కులు సృష్టించి, నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని.. రెవెన్యూశాఖలోని ముఖ్యమంత్రి సహాయనిధి విభాగం అధికారులు ఫిర్యాదు చేసారు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఈ చర్యలకు.. పాల్పడి నకిలీ చెక్కులు సృష్టించారని ఫిర్యాదు చేసారు. వివిధ శాఖలకు చెందిన బ్రాంచీల నుంచి అక్రమంగా నకిలీ చెక్కుల ద్వారా నగదును పొందేందుకు కుట్రపన్నినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version