అమెరికాలో ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా అధ్యక్ష ఎన్నిక జరిగింది. అమెరికా ఎన్నికల్లో ఇటీవలే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని నార్త్ డకోటా కు చెందిన 55 ఏళ్ల రిపబ్లికన్ పార్టీ నేత డేవిడ్ అందళ్ అక్టోబర్ 5వ తేదీన మరణించారు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన నేత ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. దాదాపు ఆయన మృతి చెంది నెల రోజుల గడుస్తుంది.
అయితే ఇటీవల అమెరికాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఈ క్రమంలోనే రిపబ్లికన్ నేత విజేతగా నిలిచారు. అంతలోనే కరోనా వయసు అతన్ని మింగేసింది. అయితే రైతులకు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో సేవ చేయాలని భావించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.