పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవతంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం. దీని కోసం అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతగానో కలలు కంటారు. అంతలా ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటి పెండ్లిలో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఇక ఇప్పటికే అలాంటి ఘటనలు మనకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తు కనిపిస్తుంటాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట్ వైరల్ గా మారింది.
మహారాష్ట్రలో ఇప్పుడు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వరదలు కూడా వస్తున్నాయి. నదులన్నీ కూడా చాలా వేగంగా పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు వరదనీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ఓ ప్రేమ జంట మాత్రం ఎలాగైనా పెళ్లి పీటలు ఎక్కేందుకు నిర్ణయించుకుంది.
కానీ ఈలోపే ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తడంతో అంతా నిరాశకు లోనయ్యారు. ఇక అన్నీ పూర్తి చేసకున్నాక ఎలాగైనా పెళ్లి చేఉకోవాలని భావించిన ఆ ప్రేమ జంట వినూత్న ప్రయోగం చేసింది. ఏకంగా వరద నీటిలోనే పరిమిత సంఖ్యతో బంధువులను తీసుకెళ్లారు యువకులు. ఇక వధువును కూడా వరుడు ఎత్తుకొని మరీ తీసుకొచ్చాడు పెళ్లి మండపానికి. దీంతో అనుకున్న టైమ్ కు ఈ నెల 26న పెళ్లి జరిగింది. కాగావధూవరులు బోట్‌లో వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.