తాగుబోతు కొడుకును రోకలిబండతో కొట్టి హతమార్చిన తల్లి..!

-

విశాఖపట్నం జిల్లాలోని అక్కయ్యపాలెం మండలంలో నిన్న అనగా శనివారం రాత్రి ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుని స్థానిక ప్రజలను విస్తుపోయేలా చేస్తుంది. అతడిని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఓ తల్లి. కానీ అందుకు బదులుగా తన కొడుకు ఆమెకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు దీంతో ఆ నరకం తాళలేక ఆ తల్లి తన కొడుకుని రోకలి బండతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చింది . పూర్తి వివరాలు తెలుసుకుంటే అక్కయ్యపాలెం లోని రామచంద్ర నగర్ కి చెందిన అశోక్ వర్మ రాడ్ వెండర్ గా పని చేసేవాడు. అయితే గత కొంత కాలంగా తాగుడికి బానిస అయిన అశోక్ వర్మ తనతో పాటే నివసిస్తున్న తల్లి వరలక్ష్మిని, చెల్లెలు శ్రీదేవిని, బావా వెంకటేశ్వరరాజు ని తీవ్రంగా వేధించేవాడు.

crime

ప్రతిరోజు సాయంత్రం కాగానే పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి అశోక్ వర్మ పెట్టె వేధింపులకు తల్లి వరలక్ష్మి, చెల్లెలు శ్రీదేవి ప్రత్యక్ష నరకం అనుభవించే వారు. శనివారం రాత్రి కూడా బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన అశోక్ వర్మ తన చెల్లితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన తల్లి వరలక్ష్మి అతడి తలపై రోకలిబండతో గట్టిగా మోదింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావమై అనంత లోకాల్లో కలిసిపోయాడు. ఈ దారుణమైన సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. తక్షణమే స్పందించిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నిందితురాలైన తల్లి వరలక్ష్మి పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version