వెంకటేశ్ కొత్త మూవీ పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’…?

-

గతంలో F2, F3 చిత్రాలు అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో వచ్చి మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రాబోయే మూవీ ని వచ్చే సంక్రాంతికే తీసుకు రాబోతున్నారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది అని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం …అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ చేస్తున్నా మూవీకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ను నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు సినీవర్గాలు వెల్లడించాయి.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ఇందులో త్రిష కథానాయికగా నటించనున్నారట. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.గతంలో వెంకటేష్ సంక్రాంతి అనే టైటిల్ తో వచ్చి హిట్ కొట్టారు. ఇక రాబోయే 2025 సంక్రాంతికి వెంకటేష్ తో పాటు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, ప్రశాంత్ వర్మ ఒక మూవీ , నాగార్జున మూవీ కూడా ఉండబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version