ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రజా గాయకుడు గద్దర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బిఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటుకు ఆయన పేరు పెట్టడం పై అసెంబ్లీలో చర్చ చేయాలన్నారు.
పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని గౌరవించినట్లేనని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజల తరపున పలు ప్రశ్నలు కూడా వేశారు. సకల సంపదలు గళ దేశంలో దరిద్రం ఎట్లుంది? దరిద్రం మొదటి నుంచి పాటించిన పాలకులదా? ప్రజలదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో భూమి, నీరు, పనిచేసే వారు ఉండగా దరిద్రమెట్లుందని అన్నారు. ఈ ప్రశ్న తనది మాత్రమే కాదని.. ప్రజల ప్రశ్న కూడా అని అన్నారు.