దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీటికి ప్రొటెక్షన్ వాడకపోవడం ప్రధాన సమస్య. చాలామంది కండోమ్స్ కొనడానికి సంకోచిస్తారు.. మనీ సమస్య ఒకటి అయితే.. మెడికల్ షాప్‌కు వెళ్లి అడగటానికి మొహమాటం. వెరసి అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని యువత కోసం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతకు ఉచితంగా కండోమ్‌లు అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫ్రాన్స్‌లో యువతకు కండోమ్‌లు ఇవ్వనున్నారట.
18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా కండోమ్‌లను ఇవ్వనున్నట్లు.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. దేశంలోని అన్ని ఫార్మసీల ద్వారా యువత ఉచిత కండోమ్‌లను తీసుకోవచ్చని ఫ్రాన్స్ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ప్రకటన చేశారు. ఇందుకు పెద్ద కారణమే ఉంది. ఆ దేశంలో అవాంఛిత గర్భధారణలు పెరిగిపోయాయి. అదేవిధంగా ఫ్రాన్స్‌లో జనాభా నియంత్రణ కూడా గాడి తప్పింది. వీటికి తోడు లైంగికపరమైన సాంక్రమిక వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
కారణం అదే..
ఆ దేశంలో అవాంఛిత గర్భధారణలు పెరిగిపోయాయి. అదేవిధంగా ఫ్రాన్స్‌లో జనాభా నియంత్రణ కూడా లేదు.. వీటికి తోడు లైంగికపరమైన సాంక్రమిక వ్యాధులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఫ్రాన్స్ అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగికపరమైన సాంక్రమిక వ్యాధుల బారినపడిన వారి సంఖ్య 30 శాతానికి పెరిగింది. ఈ వ్యాధుల నివారణతో పాటు జనాభా నియంత్రణలో కూడా తన ప్రభుత్వ నిర్ణయం ఒక చిన్న విప్లవంలా పనిచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్‌లో ఎయిడ్స్ ఇతర లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో ఇప్పటికే జాతీయ ఆరోగ్య వ్యవస్థ ద్వారా కండోమ్‌లు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా గర్భనిరోధక మాత్రలను అందజేసే పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా 26 ఏళ్లలోపు మహిళలకు ఫ్రాన్స్‌లో ఉచితంగా లైంగిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం చేస్తున్నారు. అబార్షన్‌లు కూడా ఉచితంగా చేస్తున్నారు. మొత్తానికి ఇలాంటి పథకాలను కూడా ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి.
అయితే 18- 25 అంటే అది యువతకు చాలా క్రూషియల్ ఏజ్.. ఇలాంటి పథకాల వల్ల వాళ్లు విచ్చలవిడిగా తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అబార్షన్లు కూడా ఫ్రీగా చేస్తే.. వాళ్లు ఇంక ఎందుకు భయపడతారు..? దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరగదంటారా..?