అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిండు సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
ప్రస్తుతం సభలో 56 శాతం బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై మాట్లాడే సందర్భంగా ప్రతిపక్షం తరఫున సభలో నలుగురు కూడా లేరు.ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. బలహీన వర్గాల పట్ల శ్రద్ధ లేదని అన్నారు.బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అన్నీ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.