బీజేపీలో చేరాలని ఆ పార్టీ ఒత్తిడి చేస్తుంది: అరవింద్ కేజ్రివాల్

-

ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ తనపై ఒత్తిడి తీసుకొస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ కన్వీనర్ కేజీవాల్ ఆరోపించారు. అందుకోసం తనపై కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారు ఎన్ని కుట్రలైనా చేయొచ్చు. కానీ నేను చాలా స్థిరంగా ఉండదలచుకున్నా స్పష్టం చేశారు. వారి ఒత్తిళ్లకు లొంగను. బీజేపీలో చేరితే నన్ను ఫ్రీగా వదిలేస్తారట అని అన్నారు. కానీ ఎప్పటికీ నేను మీతో కలవను అని బీజేపీకి తేల్చిచెప్పాను’ అని కేజీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్ర‌జ‌లు త‌మ‌పై ప్రేమ‌ను, ఆశీస్సుల‌ను ఇలాగే కొనసాగించాలని కేజ్రీవాల్ కోరారు.

ఢిల్లీలోని రోహిణిలో ఓ పాఠ‌శాల‌కు శంకుస్ధాప‌న చేసిన అనంత‌రం మాట్లాడుతూ…. ఢిల్లీ ప్ర‌భుత్వం సంవత్సరం 40 శాతం బ‌డ్జెట్ విద్యా వైద్యానికి వెచ్చిస్తుంది.కానీ బీజేపీ సార‌ధ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం బ‌డ్జెట్‌లో 4 శాత‌మే ఖ‌ర్చు చేస్తోంద‌ని మండిపడ్డారు. ఆప్ స‌హ‌చ‌రులు మ‌నీష్ సిసోడియా, స‌త్యేంద్ర జైన్‌ల‌ను బీజేపీ పార్టీ జైలు పాలు చేసిందని ఆరోపించారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version