రజినీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాకు భారీ షాక్

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం లాల్ సలాం.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. క్రికెట్‌, కమ్యూనిజం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే…ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా కువైట్, ఖతార్‌ వంటి అర‌బ్ దేశాల్లో ఈ చిత్రం బ్యాన్ చేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మతపరమైన అంశాలు ఈ చిత్రంలో ఉండడంతో సినిమాని బ్యాన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం అన్నది స్పష్టత రావాల్సి ఉంది . ఇక ఇటీవల ఫైటర్ మూవీ కూడా గల్ఫ్‌లో బ్యాన్ చేశారు. దాని వల్ల ఫైటర్‌కు కొంత మేర నష్టం అయితే వాటిల్లింది.

 

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version