గూగుల్ మ్యాప్స్ లో కనిపించని రహస్య ప్రదేశాలు.. 

-

గూగుల్ మ్యాప్స్ లో కనిపించని ప్రదేశాల గురించి మీకు తెలుసా? కారణమేదైనా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు గూగుల్ మ్యాప్స్ లో కనిపించవు. పిక్సల్స్ విడిపోవడమో, లేదా మసక మసగ్గా కనిపించడమో జరుగుతుంది. అలాంటి ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కట్టేనామ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ – ఫ్రాన్స్

లక్సెంబర్గ్ ప్రాంతానికి సమీపంలో ఉండే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్లలో 9వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతం గూగుల్ మ్యాప్స్ లో కనిపించదు. పిక్సల్స్ విడిపోయినట్టుగా ఉంటుంది తప్ప ప్రాంతం కనబడదు.

కోస్ అంతర్జాతీయ విమానాశ్రయం- గ్రీస్

గ్రీస్ లోని ఒకానొక దీవిలో ఉండే ఈ విమానాశ్రయం మసక మసగ్గా గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తుంది. ఛార్టర్డ్ విమానాలను నడిపే ఈ విమానాశ్రయం, దీవి అవతలి భాగాల నుండీ పర్యాటకులను తీసుకువస్తుంది. వేసవికాలంలో ఇక్కడకు పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు.

ఆమ్చిక్తా దీవి- అలస్కా

మీరు దీని గురించి గూగుల్ లో వెతికినట్లయితే దాదపు సగం కంటే ఎక్కువ దీవి మసక మసగ్గా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం ఈ దీవిలో అమెరికా న్యూక్లియర్ టెస్టులు చేస్తుందని వాదన.

జెనెత్తే దీవి- రష్యా

తూర్పు సైబీరియా సముద్రంలో ఉన్న ఈ దీవి గురించి గూగుల్ లో వెతికితే, అస్సలు ఏమీ కనిపించదు. రష్యా మిలిటరీ ప్రాంతంగా చెప్పుకోబడే ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి చూపించడం రష్యాకు ఇష్టం లేదని చెబుతుంటారు.

మినామి టోరిషిమా విమానాశ్రయం- జపాన్

జపాన్ మేరీ టైమ్ స్వీయ రక్షణ కోసం వాడే ఈ ఎయిర్ పోర్టు గూగుల్ లో మసకగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version