కడప కార్పొరేషన్ సమావేశానికి ప్రొటెక్షన్ ఇవ్వలేమని చేతులెత్తేసిన పోలీసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో రాజయాలు ఏవిధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కడప జిల్లాలో ప్రస్తుతం వైసీపీ హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో రాజకీయం ఇప్పుడు చాలా రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత ఒక ఎత్తయితే కడప రాజకీయాలు మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు ఉదాహరణే.. కడప కార్పొరేషన్ సమావేశానికి ప్రొటెక్షన్ ఇవ్వలేమని పోలీసులు  చేతులెత్తెసారు.

ఈ ఘటనతోనే స్పష్టంగా అర్థం అవుతోంది. రాయలసీమ రాజకీయాలు ఏవిధంగా ఉన్నాయనేది. కడప కార్పొరేషన్ సమావేశానికి ప్రొటెక్షన్ ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తేయడంతో.. మేయర్ సురేష్ బాబు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ సమావేశానికి వందలాది మందితో వచ్చారు ఎమ్మెల్యే మాధవి. సమావేశం కాస్త రసాభస గా మారింది. ముఖ్యంగా కార్పొరేషన్ సమావేశంలో కుర్చీ లేదని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ పై రెచ్చిపోయింది ఎమ్మెల్యే.దీంతో సమావేశాన్ని బహిస్కరించారు మేయర్, కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే వెళ్ళిపోయాక సమావేశం నిర్వహణకు మేయర్ నిర్ణయించారు. కానీ సమావేశ నిర్వహణకు బందోబస్త్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version