సీఎం చంద్రబాబు వల్లనే ఐటీలో అద్భుత ఫలితాలు : మంత్రి లోకేష్

-

వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను కూడా హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు.

విదేశాలలో మనకు విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు నారా లోకేష్. ఐటీ రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లనే ఐటీలో అద్భుత ఫలితాలు వచ్చాయని.. మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో ఇప్పుడు మన తెలుగు వాళ్లు మంచి స్థానాల్లో ఉన్నారు. గెలవడం కోసం నిలబడాలన్న మాటను విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహనతో ఉండాలని.. రాబోయే 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ది చెందనుందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version