రాష్ట్రంలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు..? ఏం చేస్తామన్నది పక్కకెల్లిపోయింది. దానిని ప్రశ్నించే స్వరం ఉండకూడదని అణగదొక్కే చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ లు అన్నారు. ప్రతీ వర్గాన్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిపోయింది. కానీ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ లు లేవన్నారు. 15వేలు అంటూ పిల్లలను మోసం చేశారు. 18వేలు అంటూ అక్క చెల్లెమ్మలను మోసం చేశారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. పిల్లలు రోడ్డెక్కుతున్నారు. పిల్లలను, రైతులను, మహిళలను ఇలా అన్నీ వర్గాల వారిని మోసం చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కాకుండా వసతి దీవెన ప్రతీ పిల్లాడికి ఇన్ స్టాల్ మెంట్ ఇచ్చేది. విద్యావ్యవస్థ రోడ్డుమీదికెక్కింది. టోటల్ క్లాస్ లను మూసేశారు. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. పిల్లలకు మెను ప్రకారం అందించాల్సిన ఫుడ్ నిర్వీర్యం అయిపోయింది. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. వైద్యం పరిస్థితి పూర్తిగా నిర్వీర్యం అయింది. 104, 108 బకాయిలు 5 నెలల నుంచి రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరాను పట్టించుకునే నాథుడే లేడని పేర్కొన్నారు జగన్.