మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పలలో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేవరుప్పలలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయగా.. ముఖ్యఅతిథిగా ఎర్రబెల్లి దయాకర్ రావును గ్రామస్తులు ఆహ్వానించారు.
అక్కడకు చేరుకున్న మాజీమంత్రిని పోలీసులు అడ్డుకోగా.. అంబేద్కర్ వాదులు వారించారు. అనంతరం అంబేద్కర్ వాదులు పోలీసులను తొసుకుంటూ ఎర్రబెల్లిని విగ్రహావిష్కరణ చేసేందుకు తీసుకెళ్లగా.. ఎర్రబెల్లి దయాకర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరీ ఇంత దౌర్జన్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
పోలీసు అధికారులు పొరపాట్లు చేయొద్దని, 100 శాతం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాను విజృంభిస్తే మీరు ఎందుకు అక్కరకు రారని.. తప్పులు చేసిన వారిని విడిచిపెట్టనని హెచ్చరించారు.