మాజీ ప్రధాని ఇందిరా హయాంలో ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని హత్య చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి.. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి, ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేశారు.ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ రాజ్యాంగాన్నే హత్య చేసిందని మండిపడ్డారు. అందుకే ఆనాడు ప్రజలు ఎదురుతిరిగి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పారని గుర్తుచేశారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతుందని.. ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేలా చేసిన ఘనత ప్రధాని మోడీదే అని వెల్లడించారు.