ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటుగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ కనుక పెరిగింది అంటే అధిక రక్తపోటుతో పాటుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, గుండె సమస్యలు మొదలైనవి వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటు అనేక సమస్యలు కలగకుండా ఉండాలంటే వీటిని తీసుకోకపోవడమే మంచిది. పీతలు, రొయ్యలు వంటి వాటిలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే బీర్, ఆల్కహాల్ ఆధారిత డ్రింక్స్ ని తీసుకుంటే కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి.
దానితో పాటుగా పలు అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఎక్కువగా షుగర్ ఉండే డ్రింక్స్ ని తీసుకుంటే కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే బచ్చలి కూర, కాలీఫ్లవర్, పాలకూర, పుట్టగొడుగులు, బఠానీలు వంటి కూరగాయలు తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి.
బ్రెడ్, బేకింగ్ చేసిన ఆహార పదార్థాలలో ఈస్ట్ ఉంటుంది. కాబట్టి ప్యూరిన్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ ఆసిడ్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఇవి కూడా వద్దు. ఫుల్ ఫ్యాట్ పాలు కూడా తీసుకోవద్దు. అలాగే ఫాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా చేసుకోకుండా ఉండడమే మంచిది. వీటి వలన కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. రెడ్ మీట్ లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇబ్బందుల్ని కలిగిస్తుంది, కాబట్టి దీనిని కూడా తీసుకోవద్దు. ఇలా వీటిని తీసుకోకుండా ఉంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగవు అలాగే అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.