అల్లు శిరీష్ తెరమరుగవడానికి కారణం..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీ లో అల్లు ఫ్యామిలీ కి కూడా మంచి గుర్తింపు ఉంది అని చెప్పవచ్చు . ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు రామలింగయ్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా చరిత్రను తన హాస్యంతో తిరగరాశారు అని చెప్పవచ్చు. ఇక ఆయన వారసుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఆయన కొడుకు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇక పెద్దకొడుకు అల్లు బాబీ కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా అల్లు శిరీష్ మాత్రం ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదని తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ మాత్రం సినిమాల విషయంలో ఇప్పటికీ సైలెంట్ ని సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక 2019లో ఏబిసిడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక కొత్త కథతో రావాలని రాకేష్ శశి డైరెక్షన్ లో ఒక ప్రేమ కథను చేస్తున్నాడు అల్లు శిరీష్.ఇక ఆ సినిమాకు ప్రేమ కాదంట అనే ఒక టైటిల్ ను కూడా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో హీరోగా అల్లు శిరీష్ నటిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ ను.. పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

ఇక ఈ సినిమాతో పాటు మొదలైన చాలా చిన్న సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవడమే కాకుండా థియేటర్లలో అలాగే ఓ టీ టీలో కూడా సందడి చేస్తున్నాయి. కానీ అల్లు శిరీష్ కి సంబంధించిన అప్డేట్స్ ను కూడా ఇవ్వకపోవడం అల్లు శిరీష్ ఎందుకు సస్పెన్షన్ మెయింటెన్ చేస్తున్నాడు అనే విషయం కూడా చాలామందికి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెరమరుగైన అల్లు శిరీష్ ఎందుకిలా ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నాడు అనే విషయం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version