మహమ్మారి మనుషులపై పెద్ద దెబ్బ కొట్టింది. దానివల్ల చాలా అలవాట్లు గంగలో కలిసిపోయాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన మాట నిజమే కానీ, ఏ పనీ లేకపోవడం వల్ల అలసత్వం పెరిగి బద్దకంగా మారి మనుషుల బరువులు పెరిగాయి. ప్రస్తుతం చాలామంది తమ శరీర ఆకారాలతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని తపనపడుతున్నారు. ఐతే కొందరికి తమ శరీర ఆకారం మారిందని, అది తమ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందన్న విషయం అర్థం కావట్లేదు. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ఉన్నాయి.
చిన్నపాటి పనికే శ్వాస ఎగదీసుకోవడం
చిన్న చిన్న పనులకు కూడా శ్వాస ఎగదీసుకుంటుంటే, మీ శరీర ఆకారంలో మార్పులు వచ్చి అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మెట్ల మీద నడిస్తే కూడా శ్వాస తీసుకోవడం ఎక్కువవుతుంటే శారీరకంగా ఫిట్ గా లేరని అర్థం చేసుకోవాలి.
గుండె స్పందనల వేగం
పని చేసి చేసి విశ్రాంతి తీసుకునేతపుడు మీ గుండే శబ్దాన్ని వినండి. కావాలంటే స్మార్ట్ వాచీలు చూసుకోండి. మీ గుండె స్పందనల వేగం పెరిగినట్లుగా అనిపిస్తే మీరు శారీరకంగా సరిగ్గా లేరని తెలుసుకోండి.
సులభంగా గాయాలకు గురి కావడం
శారీరకంగా ఫిట్ గా లేకపోతే గాయాలు, నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. క్రమం తప్పని వ్యాయామం దీని బారి నుండి కాపాడుతుంది. లేదంటే అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని శరీరం నొప్పుల పుండుగా మారుతుంది.
నిద్రలేని రాత్రులు
వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం మొదలగునవి నిద్రలేని రాత్రులను తీసుకువస్తాయి. ఇలా కొనసాగుతూ ఉంటే దీర్ఘకాలికంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువ.