మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసింది. ఇటీవల ఈ మూకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో ఘనంగా నిర్వహించారు. అయితే, మెగా పవర్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే వేదికను పంచుకోవడంతో ఫ్యాన్స్ పెద్దఎత్తున ఈవెంట్‌కు విచ్చేశారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మెగా ఫ్యాన్స్ చనిపోయిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ ఘటనపై మృతుడి తండ్రి స్పందించాడు. చిరంజీవి మీద అభిమానంతో చనిపోయిన తన కొడుకుకి చరణ్ అని పేరు పెట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. వారిని అంత అభిమానిస్తే కనీసం పరామర్శకు కూడా నోచుకోలేదని బాధిత పేరెంట్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇప్పటివరకు ఎవరు పరామర్శకు రాలేదు.కనీసం అభిమానులు కూడా మాట్లాడలేదు. రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తే కూడా స్పందించలేదని వాపోయాడు.