శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజు

-

పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించిన సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తో దిల్ రాజు కూడా బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు.

రేవతి భర్త భాస్కర్ ను  వివరాలు అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. అలాగే డాక్టర్లతో శ్రీతేజ్ ఆరోగ్యం పై అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్, దిల్ రాజు కిమ్స్ ఆసుపత్రికి రావడంతో భారీగా పోలీసులు ఆసుపత్రి ఆవరణలో మోహరించారు. భారీ సెక్యూరిటీ మధ్య అల్లు అర్జున్ ఆసుపత్రిలో పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి వెల్లే సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్ పేట పోలీసులు ముందస్తుగానే అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version