రాష్ట్రాన్ని అందరం కలిసి పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది : సీఎం చంద్రబాబు

-

రాష్ట్రాన్ని అందరం కలిసి పట్టాలెక్కించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని సరి చేయాలి. గత ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసం వల్లనే ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీని అందించారు.

దాదాపు 93 శాతం స్ట్రైకింగ్ రేటుతో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 2021 లోపు పోలవరం పూర్తయ్యేది అని తెలిపారు. 2019-2024 వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలను సరి చేయడానికి దాదాపు 5 నెలల సమయం పట్టిందని తెలిపారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. అందుకే అమరావతి కోసం భూసేకరణ చేపట్టామని..  ఏపీలో అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version