తెలంగాణ రైతులకు షాక్‌.. అప్పటి వరకు రైతు భరోసా రాదు !

-

తెలంగాణ రైతులకు షాక్‌.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందజేస్తామని ప్రకటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూన్‌ లో ఈ నివేదిక రావాల్సి. కానీ ఇప్పటికీ రాలేదు. కేంద్రం గైడ్లైన్స్ లో మార్పులు చేయాలని కోరుతున్నామని… 2 లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తామని ఈ సందర్భంగా తుమ్మల ప్రకటించారు.

tummala, rythu bharosa

ఈ ఏడాది వరి సాగులో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఒక కోటిన్నర లక్షల ఎకరాల దిగుబడితో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టామన్నారు. గతంలో 41లక్షల ఎకరాలల్లో ఉన్న దొడ్డు ధాన్యం ఈ ఏడాది 21లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి పెరిగింది….దేశ వ్యాప్తంగా సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగిందన్నారు. 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి…గతంలో ఈ రోజు నాటికి 17 జిల్లాల్లో మాత్రమే జరిగాయని తెలిపారు. 9.7 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ళు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చేశారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version