కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థి.. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి షాకింగ్

-

ఏపీలోని విజయనగరం పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా సిబ్బంది సమాచారంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ట్రీట్మెంట్‌లో భాగంగా ఆస్పత్రి సిబ్బంది విద్యార్థికి ఇంజెక్షన్ ఇవ్వగా.. అది వికటించడంతో ఆ విద్యార్థి ప్రాణాలు పోయాయి.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చనిపోయాడని, దీనిపై విచారణ జరిపి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతి చెందిన విద్యార్థి తరఫు బంధువులు, పేరెంట్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news