ఆయనకు పదవి ఇచ్చిన అధిష్టానం.. టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత?

-

హుజురాబాద్ బై పోల్‌లో గులాబీ జెండాను నిలుపుకునేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ ( Trs Party ) ‘దళిత బంధు’ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా, హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డుతుందనే చెప్పొచ్చు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే నియోజకవర్గానికి చెందిన నేతలు గులాబీ తీర్థం పుచ్చుకుంటుడటం మనం చూడొచ్చు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ గూటికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి‌కి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ విషయమై టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

 

TRS-Party | టీఆర్ఎస్

ప్రతిపక్ష పార్టీలు పాడి కౌశిక్‌‌రెడ్డిని ఎమ్మెల్సీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులను, టీఆర్ఎస్ సీనియర్ నేతలను పక్కనబెట్టి మొన్ననే గులాబీ గూటికి వచ్చిన పాడి కౌశిక్‌ను ఎమ్మెల్సీ చేయడం ద్వారా ఉద్యమకారులకు తమ పార్టీలో విలువలేదనే సంకేతాలు టీఆర్ఎస్ పంపినట్లే అర్థమవుతున్నది దుయ్యబడుతున్నారు. కౌశిక్‌కు బదులుగా భౌగోళిక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుండేదని అంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టలు పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కౌశిక్ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకారులను రాళ్లతో కొట్టించిన ద్రోహికి ఎమ్మెల్సీ ఇవ్వడమేంటని అడుగుతున్నారు.

కేవలం రాజకీయ లబ్ధి కోసమే పింక్ పార్టీ పాకులాడుతున్నట్లు తెలుస్తోందని విమర్శలు వస్తున్నాయి. అయితే, కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా హుజురాబాద్ నేతలకు టీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ నియోజకవర్గ ప్రజలు భావించే అవకాశముంటుందని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇక ఈటలను ఓడించేందుకుగాను ఆయన అనుచరులకూ టీఆర్ఎస్ పార్టీ పదవులను కట్టబెడుతోంది. ఈటల అనుచరుడిగా పేరున్న బండ శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఇది వ్యూహం పరంగా ఓకే. కానీ,

Read more RELATED
Recommended to you

Exit mobile version