కరోనా కేసులు మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే పరిస్థితి అదుపులోకి రావడం లేదు. రెండో వేవ్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్ట్ కేంద్రాన్ని నివేదిక అడిగింది. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, ఢిల్లీ ల కరోనా కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
రెండు రోజుల్లో ఈ నివేదిక సమర్పించాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఇక ఢిల్లీలో, మహారాష్ట్రలో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. మహారాష్ట్రలో రెండో వేవ్ సునామీలా ఉంటుంది అని ఆ రాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే వెల్లడించారు. గుజరాత్ లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.